ఈ 7 పనులు చేయండి... బరువు ఎలా తగ్గరో చూద్దాం...

శుక్రవారం, 14 జూన్ 2019 (13:03 IST)
ఇటీవలి కాలంలో మారిన జీవన పద్ధతులు కారణంగా స్త్రీపురుషులు అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. ఇలాంటివారు ఈ క్రింది తెలిపిన చిట్కాలు పాటిస్తే బరువు పెరగకుండా అదుపులో వుంచుకోవచ్చు. అవేంటో చూద్దాం పదండి. 
 
1. ఉదయం ఏడు గంటలకు ఒక పండు, గ్రీన్ టీ తీసుకోవాలి.
 
2. ఉదయం ఎనిమిది గంటలకు ఒక పెసరట్టు, చట్నీ, మజ్జిగ లేదంటే ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి.
 
3. పదకొండు గంటలకి పది బాదం పప్పులతో పాటు మజ్జిగ తాగాలి.
 
4. మధ్యాహ్నం ఒంటి గంటకు వెజిటబుల్ సలాడ్, బ్రౌన్ రైస్ ఒక కప్పు, పప్పు, ఆకు కూర, మజ్జిగ తీసుకోవాలి.
 
5. సాయంత్రం నాలుగు గంటలకు ఏదైనా పండు, గుప్పెడు గుమ్మడి గింజలు.
 
6. సాయంత్రం ఆరుగంటలకు సూప్ తీసుకోవాలి.
 
7. రాత్రి ఎనిమిది గంటలకు వెజిటబుల్ సలాడ్, రెండు పుల్కాలు, అవసందలు, వెజిటబుల్ కూర, మజ్జిగ. ఇవి పాటిస్తే బరువు అదుపులో వుండటం ఖాయం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు