ముఖ చర్మంపై ఏర్పడిన మొటిమలకు చెక్ పెట్టాలంటే.. కలబంద రసాన్ని వాడి చూడండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖంపై ఏర్పడిన మచ్చలు, మొటిమలు తగ్గాలంటే.. పొడిబారిన చర్మానికి మేలు చేకూర్చాలంటే.. కలబంద రసాన్ని రోజూ ముఖానికి రాసుకుంటూ వుండాలి. పురుషులు ముఖానికి షేవ్ చేసుకున్న తర్వాత కలబంద రసం రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
ఇక చుండ్రును తొలగించుకోవాలంటే.. కలబంద గుజ్జును మాడుకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత కడిగియాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే చుండ్రు మాయమవుతుంది. కలబంద గుజ్జు, కొబ్బరినూనెను వేడి చేసి తలకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. ఇందులోని విటమిన్ సి, బి ధాతువులు చర్మానికి మేలు చేస్తాయి. ముఖంపై గల ముడతలను తగ్గిస్తాయి. చర్మంలోని కొలాజన్ అనే కొవ్వు శాతాన్ని తగ్గించే ప్రోటీన్లు కలబందలో పుష్కలంగా వున్నాయి.