దానిమ్మ చూడడానికి ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషక పదార్థాలు ఎక్కువగా ఏ పండులో ఉన్నాయని చెప్పొచ్చంటే.. అది దానిమ్మే. దానిమ్మ పండు తరచు తీసుకుంటే శరీరంలో రక్తం పెరుగుతుంది. దానిమ్మలో పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ సి, కె వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఇవి పలురకాల అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. ఈ పండుని తీసుకోవడం వలన కలిగే మరికొన్ని ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
2. సాధారణంగా కొందరు వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటారు. అలాంటివారు.. ప్రతిరోజూ గ్యాస్ మోతాదులో దానిమ్మ జ్యూస్ తాగాలి. అప్పుడే మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. ఈ జ్యూస్ తాగడం వలన జ్వరం, ఇన్‌ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా రావని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు.
4. దానిమ్మ పండు తీసుకోవడం వలన శరీరంలోని చెడు వ్యర్థాలు, బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి. మన శరీరంలో ఈ రెండు సమస్యలు తొలగిపోతే చాలు.. గుండెకు రక్తం బాగా సరఫరా అవుతుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధులనుండి ఉపశమనం లభిస్తుంది.
5. దానిమ్మ తొక్కలను ఎండబెట్టుకుని పొడిచేసి నిల్వచేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ రాత్రివేళలో నిద్రకు ఉపక్రమించే ముందుగా గ్లాస్ పాలలో వేసి, కొద్దిగా చక్కెర కలిపి తీసుకోవాలి. ఈ రోజూ తాగితే.. కీళ్ల దగ్గర వాపులు, నొప్పులు తగ్గుముఖం పడుతాయి.