ద్రాక్షల్లోని విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి...?

శనివారం, 2 ఫిబ్రవరి 2019 (10:28 IST)
ప్రస్తుత కాలంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ద్రాక్షలే కనిపిస్తున్నాయి. ద్రాక్షలు ఎరుపు, పచ్చ, నలుపు వంటి రంగుల్లో లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పటి తరుణంలో ఎరుపు ద్రాక్షలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఎరుపు ద్రాక్షలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
1. ఎరుపు రంగుగా ఉన్న ద్రాక్ష పండ్లు తీసుకోవడం వలన రక్తంలోని గ్లూకోస్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. మధుమేహ వ్యాధితో బాధపడేవారు తరచు ఈ ద్రాక్షలు తింటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 
 
2. ఈ ద్రాక్షల్లోని విత్తనాలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా చేసిన పొడిని గ్లాస్ పాలలో కలిపి ప్రతిరోజూ తాగితే అధిక బరువు తగ్గుతారు. దాంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
 
3. రోజంతా పనిచేసి అలసట, ఒత్తిగా ఉన్నవారు కప్పు ద్రాక్ష పండ్లు తింటే.. పోయిన ఎనర్జీ అంతా తిరిగి పొందవచ్చును. వీటిని తినడం వలన శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు, వ్యర్థాలు తొలగిపోతాయి. 
 
4. నిత్యం ఎరుపు రంగు ద్రాక్షలను తింటుంటే.. రక్త సరఫరా మెరుగుపడుతుంది. అలానే కంటి సమస్యలతో బాధపడేవారు రోజూ గ్లాస్ ద్రాక్ష జ్యూస్ తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది.
 
5. ద్రాక్షల్లోని గుజ్జును మాత్రం తీసి అందులో కొద్దిగా చక్కెర, తేనె కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా రోజూ తింటే.. శరీర నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు రావు. 
 
6. ద్రాక్ష తొక్కలను పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో గానీ, మజ్జిగలో గానీ కలిపి తాగితే.. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు