ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలిస్తే?

సోమవారం, 23 మార్చి 2020 (23:38 IST)
మన పూర్వీకులు ఆయా పదార్థాల్లో వున్న పోషకాలు గురించి తెలుసు కనుకనే వాటిని మన ఆహారంలో భాగం చేశారు. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని పైటేట్ అనే యాంటీ ఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వుల్లోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. పాలిచ్చే తల్లులకు రోజూ కొంచెం నువ్వులు పెడితే పాలు పడతాయి. ప్రతిరోజూ ఒక నువ్వుల ఉండ తినడం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది.
 
2. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి నువ్వులు మంచి ఔషధంలా పని చేస్తాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. నువ్వులనూనెను ఒంటికి మర్దనా చేసుకోవడం వలన కూడా కీళ్లనొప్పులు తగ్గుతాయి.
 
3. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. అంతేకాకుండా మధుమేహం, బీపీ లను నివారిస్తుంది.
 
4. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడతాయి. ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
 
5. వీటిల్లో అధిక మోతాదులో ఉండే కాపర్, కీళ్లు, కండరాల నొప్పుల్నీ మంటల్ని తగ్గించడంతో పాటు శరీరమంతా ఆక్సిజన్ సరఫరాకు తోడ్పడుతుంది.
 
6. నువ్వుల్లోని సెసమాల్ అనే కర్బన పదార్థం, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో రేడియేషన్ కారణంగా కణాల్లోని డిఎన్ఎ దెబ్బ తినకుండా కాపాడుతుంది. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఆస్త్మా రోగుల్లో శ్లేష్మాన్ని హరిస్తాయి. నిద్రలేమిని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు