మన ప్రకృతి మనకు ఎన్నో రకాల చెట్లను, పండ్లను ఇచ్చింది. మన పూర్వీకులు సహజంగా లభించే చెట్ల ఆకులను, కాయలను ఉపయోగించుకొని ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలను పొందుతూ ఉంటారు. మనకు ఉపయోగపడే వాటిలో మర్రిచెట్టు ఒకటి. కానీ మర్రిపండు గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే పెద్దపెద్ద సిటీస్‌లలో ఉండేవాళ్లు ఈ మర్రిచెట్టును చూసి ఉండరు. ఈ మర్రిచెట్టు ఆకులు, కాయల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలుఉన్నాయి. ఇది చూడటానికి ఎరుపురంగులో చాలా అందంగా ఉంటాయి.
వీటిని తినడం వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాం...
1. మర్రి కాయలను ప్రతిరోజు తినడం వలన పిల్లలలో జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. పొట్టిగా ఉన్న పిల్లలు ఈ మర్రికాయలను క్రమం తప్పకుండా తినడం వలన బాగా ఎత్తు పెరుగుతారు.
2. మర్రి ఆకుల్ని మెత్తగా పేస్టులా చేసి ముఖానికి రాయడం వలన ముఖంపై ఉన్న మెుటిమలు, మచ్చలు పోయి ముఖం తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది.