* సాధారణంగా రాత్రిపూట చాలా మంది అన్నంకు బదులు చపాతీ, టిఫన్ వంటివి తీసుకుంటుంటారు. వీటికంటే అన్నం ఆరగించడమే ఉత్తమమని వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే.. అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. దీంతో లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది.
* తక్కువ మోతాదులో అన్నం తినడంతోపాటు దాంట్లో పప్పులు, కూరగాయలు, నెయ్యి వంటి ఆహారాలను చేర్చుకుంటే భోజనం చేసిన వెంటనే షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటిస్ ఉన్నవారు కూడా అన్నంతిన్నట్టయితే చక్కెర నిల్వల స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని చెపుతున్నారు.
* అన్నం తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. నిత్యం మనం తినే జంక్‌ఫుడ్, నూనె పదార్థాలు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్లే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే అన్నం ఆరగించడమే ఉత్తమం.