సాధారణంగా మం ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించి మందులు వాడుతుంటాము. అప్పటికి ఆ సమస్యకు ఉపశమనం కలిగినా మరలా కొంతకాలానికి ఆ సమస్య తలెత్తవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా మందులు వాడటం వల్ల వేరే రకమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలాకాకుండా ఉండాలంటే మనకు ప్రకృతిలో సహజసిద్దంగా దొరికే వాటిని మందులాగా తయారుచేసుకుని వాడడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అలాంటి వాటిల్లో నల్లతుమ్మ మన ఆరోగ్య సమస్యలకు అద్బుతమైన ఔషదంలా పని చేస్తుంది. అవేంటో చూద్దాం.
1. ఎండిన నల్ల తుమ్మకాయలు, బెరడు, బంక ఈ మూడింటిని సమంగా కలిపి చూర్ణం చేసుకుని స్పూన్ మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. నడుముకు శక్తి, బలం కలుగుతుంది.