ముల్లంగి గింజలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకుని తింటే..?

మంగళవారం, 30 అక్టోబరు 2018 (18:27 IST)
మనం ఇంట్లో వుండే ఆకు కూరలు, కూరగాయలను పెద్దగా పట్టించుకోము కానీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉదాహరణకు ముల్లంగినే తీసుకోండి...
 
1. ముల్లంగి రసాన్ని రోజూ తాగుతూ వుంటే కాలేయానికి సంబంధించిన చాలా వ్యాధులను అడ్డుకోవచ్చు.
 
2. ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని తేనెతో కలిపి రోజూ ఒక చెంచా చొప్పున తీసుకుంటే వాపు, నొప్పి ఏ అవయవంలో వున్నప్పటికీ క్రమేణా తగ్గిపోతాయి.
 
3. ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కొంచెం ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే తగ్గిపోతాయి. 
 
4. ముల్లంగి గింజలను బాగా ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకుని తింటూ వుంటే స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తొలగిపోతాయి. 
 
5. పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే సాఫీగా విరేచనాలు అవుతాయి. జీర్ణశక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. 
 
6. విపరీతమైన దగ్గు, జలుబు ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే సత్వరమే నివారణ అవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు