యాపిల్ టీ తాగితే.. ఎంత మేలో తెలుసా?

బుధవారం, 17 జూన్ 2020 (18:57 IST)
Apple Tea
రోజుకో ఆపిల్ తీసుకోవడం ద్వారా వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన పని వుండదని అందరికీ తెలుసు. అలాంటిది యాపిల్ టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందా అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 
 
యాపిల్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. యాపిల్ టీ తాగడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు… రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. శరీరంలోని ఇన్ ఫెక్షన్లను కూడా నివారించవచ్చు.
 
యాపిల్ టీని తాగడం వల్ల పొట్టలో పేరుకుపోయే ఎన్నో రకాల వ్యర్థాలను బయటికి పంపించవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఉదర సంబంధ సమస్యలన్నింటికీ.. యాపిల్ టీ చక్కని ఔషధమని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
అలాగే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా కూడా యాపిల్ టీ తాగితే చక్కటి ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు.. యాపిల్ టీతో చర్మం కాంతివంతం అవుతుంది. యాపిల్ టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. అందం కూడా పెరుగుతుంది. చర్మం మెరుస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు