క్యారెట్ ఆహారంగాను, ఔషధంగాను ఉపయోగపడుతుంది. క్యారెట్ జీర్ణం కావడానికి సుమారు రెండున్నర గంటల సమయం పడుతుంది. రోజు క్యారెట్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్, జీర్ణశయ సంబంధ క్యాన్సర్ బారినపడకుండా ఉండవచ్చు. క్యారెట్లో పీచు పదార్ధం ఎక్కువుగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది.
1 . ప్రతిరోజు రాత్రి ఒక కప్పు క్యారెట్ రసంలో ఒక గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో పాటు తీసుకుంటే మానసికంగా శ్రమపడే వారికి ఎంతో ఉపయోగపడటమే కాకుండా ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.