నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాల సేపు పాదాలను, అరికాళ్లను నెయ్యి లేదా ఆముదంతో మర్దన చేస్తే ప్రశాంతంగా, హాయిగా నిద్ర వస్తుంది.
రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండం వల్ల గుండె పదిలంగా వుంటుంది. శరీరమునకు ఏ రకమైన వ్యాధి రాకుంటా ఉండేందుకు ఈ పండ్లు, కూరగాయలు చాలా బాగా ఉపయోగపడుతుంది.
డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్ల రసం, కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింకులు మాత్రం తీసుకోకూడదు.
ఒక స్పూన్ కొత్తిమీర రసానికి ఒక కప్పు మజ్జిగ చేర్చి తాగితే అజీర్ణం, వాంతులు, ఎక్కిళ్లు లాంటి సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల పళ్లు, చిగుళ్లు కూడా బలంగా తయారవుతాయి.