ఆ.. ఆ... అమ్మో పిక్క పట్టేసింది... ఏం చేయాలి?

బుధవారం, 3 జులై 2019 (20:37 IST)
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది కండరాల నొప్పులుతో ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణం మనం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే బీట్‌రూట్ కండరాల నొప్పులు, పిక్కలు పట్టేయడం వంటి సమస్యలకు మంచి ఔషధంలా పని చేస్తుంది.

అంతేకాకుండా రక్తలేమి సమస్యతో బాధపడేవారు బీట్‌రూట్ రసం తాగడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. బీట్‌రూట్ కండరాలలో బలం చేకూర్చడానికి ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం.
 
1. బీట్రూట్‌లో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రయల రేటుని మెరుగుపరుస్తాయి.
 
2. బీట్రూట్ రసం తాగడం వలన గుండె నుండి ప్రతి శరీర భాగానికి ముఖ్యంగా కండరాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది. అంతేకాకుండా, గుండెకి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి వరుసగా కొన్నాళ్లపాటు ఈ రసం తాగడం వలన కండరాలూ, శరీరం దృఢంగా తయారవుతాయి.
 
3. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు శరీరానికి అందడం వలన శరీరంలోని రక్తనాళాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీనివల్ల కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. 
 
4. వయసు పెరిగేకొద్ది బీట్రూట్ రసానికి తగినంత ప్రాధాన్యమవ్వాలి. కనీసం వారానికి రెండు సార్లయినా బీట్రూట్‌ని ఆహారంలో తీసుకుంటే మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు