నేరేడు పండు వల్ల కలిగే ప్రయోజనాలు (Video)

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (15:26 IST)
తీపి, పులుపు రుచుల సమ్మేళనమే ఈ నేరేడు పండు. నేరేడు ఆకులు, బెరడును కూడా ఔషధాల తయారీలో వాడతారు. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్, కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి. నేరేడులోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 
*నేరేడు పండు తింటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. నేరేడు పండు రసం ఫైటో కెమికల్‌గా పనిచేస్తుంది. ఈ రసం తాగితే కాలేయం సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.
 
*దీనిలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. కాబట్టి హెల్తీ స్నాక్‌గా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఫుడ్ ఛాయిస్.
 
*దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిని శుభ్రపరచడమే కాదు దంతాలు, చిగుళ్లను దృఢంగా చేస్తాయి కూడా.
 
*రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ కాకుండా చూస్తుంది. గుండె కండరాలు గట్టిపడకుండా చూసి, హృదయ సంబంధవ్యాధుల్ని నివారిస్తుంది.
 
*అస్తమా, విపరీతమైన దగ్గు వంటి జబ్బుల్ని నయం చేయడంలో నేరేడు ఉపయోగపడుతుంది.
 
*ఈ పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో పాటు నీరు కూడా ఎక్కువే ఉంటుంది. వీటిని తింటే దాహం తీరుతుంది. అంతేకాదు శరీరం చల్లబడుతుంది కూడా.
 
*ఎండిన నేరేడు పండ్ల పొడి చర్మం మీది ఎర్రని మచ్చలను పోగొట్టి, కాంతినిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు