గంజితో దురదకు చెక్...

గురువారం, 29 ఆగస్టు 2019 (18:14 IST)
మన ఇంట్లో అన్నం వండినప్పుడు వచ్చే గంజిని చాలా మంది తెలియక వృధా చేస్తుంటారు. గంజి నీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు దానిలో కాస్తంత ఉప్పు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నీరసంగా ఉన్నప్పుడు గంజి నీటిని త్రాగితే శక్తి వస్తుంది. గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషణ లభిస్తుంది. విటమిన్ల లోపం రాకుండా జాగ్రత్తపడవచ్చు. 
 
పిల్లలకు గంజిని తాగిస్తే చాలా మంచిది. వారి శారీరక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దాంతోవారికి కావాల్సిన ఆహారం సరిగ్గా అంది శక్తి లభిస్తుంది. పోషణ సరిగ్గా ఉంటుంది. విరేచనాలు అయిన వారు గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి. చర్మంపై దురద వస్తుంటే ఆ ప్రదేశంలో కొద్దిగా గంజి నీటిని పోసి సున్నితంగా మర్దనా చేయాలి. ఫలితంగా దురదలు తగ్గిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు