Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

సిహెచ్

శనివారం, 14 డిశెంబరు 2024 (23:13 IST)
Ginger Milk in winter శీతాకాలం వచ్చిందంటే పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. వీటిలో ప్రధానమైనవి దగ్గు, జలుబు. వీటిని నిరోధించాలంటే అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము.
 
అల్లం పాలు గొంతు నొప్పి, జలుబు(Cold), ఫ్లూ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
అల్లం జీర్ణక్రియకు సహాయపడటమే కాక వికారం తగ్గిస్తుంది. కీమోథెరపీ-ప్రేరిత వికారం తగ్గించడానికి అల్లం సమర్థవంతమైనది.
అల్లం యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది కనుక రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పాలలోని వెచ్చదనం, దాల్చినచెక్కలోని ప్రశాంతత గుణాలు శరీరానికి విశ్రాంతినిస్తాయి, అల్లం ఒత్తిడి- టెన్షన్‌ని తగ్గిస్తుంది.
పాలలో దాల్చినచెక్క, అల్లం కలిపి తాగుతుంటే చెడు కొలెస్ట్రాల్‌ (bad cholesterol) తగ్గిపోయి రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గిస్తుంది.
దాల్చినచెక్క, అల్లం రెండూ జీవక్రియను మెరుగుపరిచి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు