ఆ సామర్థ్యం కోసం పురుషులు తీసుకోవాల్సిన పదార్థాలు ఇవే...

ఆదివారం, 26 జూన్ 2016 (10:44 IST)
సాధారణంగా పురుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. దీంతో పడక గదిలో తుస్‌మనిపోతుంటారు. ఇలాంటి లోపాలను సరిదిద్దేందుకు ప్రకృతి కొన్ని రకాలై పండ్లతో పాటు.. వనమూలికలను కూడా ఇచ్చింది. వీటిని ఆరగించడం వల్ల పడక గదిలో రెచ్చిపోవచ్చని శృంగార వైద్యులు చెపుతున్నారు. అలాంటి వాటిలో ఓ నాలుగింటి గురించి తెలుసుకుందాం. 
 
1. మునగ... సెక్స్ లోపాలకి మునగ మంచి మందు. సెక్స్ లోపాలను సరిదిద్దేందుకు ప్రకృతి ఇచ్చిన మందుల్లో ఇదొకటి. దీన్ని ఎక్కువగా తీసుకుంటే పడక గదిలో ఎంతసేపైనా రెచ్చిపోవచ్చట. అందుకే దీన్ని ప్రకృతి వయగ్రా కూడా భావిస్తారు. మునగాకు, మునగ రసం, మునగ కాయలతో చేసిన కూరలు తరచూ ఆరగించినట్టయితే పడక గదిలో మీరే రారాజుగా మారిపోతారు. 
 
2. వెల్లుల్లి... వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది స్త్రీపురుషుల్లో సంతానోత్పత్తిని పెంచే సరైన ఆహారం కూడా. ఇందులో అధికంగా బి6 విటమిన్ ఉంటుంది. వెల్లుల్లి మగవాళ్ళలో కామకోర్కెలను అధికంగా పెంచుతుంది. అందువల్ల ప్రతి రోజూ వెల్లుల్లిని మనం తినే వేపుళ్లు, పచ్చళ్లలో అధికంగా తీసుకుంటే ప్రతి మగాడు కామాంధుడిగా మారిపోయి.. శృంగార సామ్రామ్యాన్ని ఏలేస్తారట. 
 
3. దానిమ్మ... ప్రకృతి ప్రసాదించిన పండల్లో దానిమ్మ పండ్లు ఒకటి. ఇవి ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన పండ్లు. అయితే, తొక్క వలుచుకుని ఆరగించడం చాలా మందికి బద్ధకంగా ఉంటుంది. కానీ, దానిమ్మ గింజలను ఆరగించినా, దానిమ్మ రసం తాగినా పురుషుడిలో వీర్యకణాలు పెంచడమే కాకుండా, వాటి కదలికలను, వాటి నాణ్యతను అలాగే ఉంచి పురుషుడిలో సెక్స్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందట. 
 
4. నారింజ పండు... ప్రతి వ్యక్తి తీసుకునే పండ్లలో ఆరంజ్ కూడా ఉంటుంది. పైగా, చాలా చౌకగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. నారింజ తొనలు, నారింజ రసం సేవించినట్టయితే శృంగార మన్మథుడిగా మారిపోవడం ఖాయమని శృంగార నిపుణులు చెపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి