Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

సెల్వి

సోమవారం, 12 మే 2025 (07:18 IST)
హీరో విశాల్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం నిర్వహించిన ట్రాన్స్‌జెండర్‌ అందాల పోటీలకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. స్టేజ్‌పై వుండగా సడన్‌గా సొమ్మసిల్లి పడిపోయారు. విశాల్ స్పృహతప్పి పడిపోయిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేసినట్లు తెలుస్తోంది. ఆహారం తీసుకోకపోవడం వల్లనే నటుడు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా తమిళ మీడియా పేర్కొంది. 
 
ప్రస్తుతం విశాల్ పూర్తిగా క్షేమంగా ఉన్నాడని తెలుస్తోంది. అరగంట విశ్రాంతి తీసుకున్న తర్వాత విశాల్ కోలుకున్నాడని తెలుస్తోంది. జనవరిలో 'మద గజ రాజా' సినిమా ప్రమోషన్స్‌లో విశాల్‌ చాలా నీరసంగా కనిపించిన సంగతి తెలిసిందే. 
 
స్టేజ్‌పై వణుకుతూ కనిపించడంతో, అతని ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు వేదికపై స్పృహతప్పి పడిపోయిన ఘటన ఫ్యాన్స్‌ను మరింత ఆందోళనకు గురిచేసింది. కాకపోతే ఇప్పుడు బాగానే ఉన్నాడని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Actor #vishal is completely fine now. Was with him from evening 6pm till now in #Villupuram. Yes he fainted just after the function but Ex. minister @KPonmudiMLA taken him to nearby hospital immediately and doctor confirmed he his good and advised not to skip meal. pic.twitter.com/oekpdsVoub

— Surendiran G R (@SurenGR) May 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు