వర్షాకాలంలో కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలేసి మంచం కింద పెడితే దోమల బెడద తగ్గుతుంది. అలాగే వర్షాకాలం ఇంటిని వేడి నీటిలో శుభ్రపరచయం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. జ్వరం, బలుబు వంటి రుగ్మతలు దరిచేరకుండా వుండాలంటే వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. తడి లేకుండా పొడిబట్టతో ఇంటిని శుభ్రపరుస్తూనే వుండాలి.
ఇక కర్పూరంతో ఈగలు, దోమలు ఇంట్లోకి రానీయకుండా చేయొచ్చు. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి ఫ్లోర్‌ను తుడిస్తే క్రిములు నశించడంతో పాటు ఈగలు, దోమలు రావు. వర్షాకాలంలో స్నానం చేసే వేడి నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే శరీరంపై ఉన్న క్రిములన్నీ చనిపోతాయి.