వర్షాకాలంలో కాలి గోళ్ళను శుభ్రం చేస్తున్నారా..? కాలిగోళ్ళను శుభ్రంగా ఉంచుకోవడంతో ఇన్ఫెక్షన్లు, జ్వరం, జలుబు నుంచి దూరంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించండి.
వర్షాల్లో తడిచినట్లైతే స్నానం చేస్తున్నప్పుడు కాళ్ళను కడగడం మర్చిపోకండి. కాళ్ళను శుభ్రం చేసేటప్పుడు సబ్బును ఉపయోగించండి. కానీ పాదాలకు మాత్రం సున్నితమైన సబ్బును వాడండి. గోరు చుట్టూ ఉన్న ప్రదేశాన్నే కాక కాలి వేళ్ళను, పాదాలను కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నించండి.
చివరగా, కాలి గోళ్ళు శుభ్రంగా, తాజాగా కనపడడానికి, గోరు రంగుతో ఉన్న నైల్ పాలిష్‌ను వాడితే, అవి కొత్తగా కనపడతాయి. ప్రతి వారం దాన్ని తొలగించి తిరిగి వాడితే ఫలితం ఉంటుంది.