మలబద్దక సమస్యను అధిగమించడం ఎలా...?

మంగళవారం, 27 జూన్ 2017 (14:53 IST)
మలబద్దక సమస్య అనేది ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటుంటారు. ప్రతిరోజు మలవిసర్జన సరైన సమయంలో చేసే వారిలో ఈ వ్యాధి రావడం చాలా తక్కువే. అయితే చాలామంది మలబద్దక సమస్యను చర్చించడానికి ఇబ్బంది పడుతుంటారు. కొంతమందిలో మూడు, నాలుగు రోజుల పాటు మలవిసర్జన అనే మాటే ఉండదు. అలా మలవిసర్జన జరుగకపోతే అనారోగ్యం రావడం ఖాయమంటున్నారు వైద్యులు. 
 
మలబద్దక సమస్య అనేది రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి. మలబద్దక సమస్య ఉంటే ఒక టీస్పూన్ త్రివల చూర్ణాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. ఈ త్రివల చూర్ణం ఆయుర్వేదిక్ మందుల షాపులో ఈజీగా లభిస్తుంది. దీన్ని తాగితే సుఖవిరోచనాలు అవుతాయి. త్రివల చూర్ణం ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్దక సమస్యను చర్కగా నిరోధించడంలో పనిచేస్తుంది. అలాగే ఆహార పదార్థాలు ఎక్కువగా ఉండే పడ్లను ఎక్కువగా తీసుకోవాలి.
 
రెండురోజుల పాటు మలవిసర్జన జరుగకపోతే దానిమ్మపండ్లు, జాంపండ్లు తింటే మరుసటి రోజు మలవిసర్జన జరుగుతుంది. అలాగే నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు కనీసం నాలుగులీటర్ల నీటిని తీసుకోవాలి. మలబద్దకం ఉన్నవారు ఉదయం లేవగానే మూడు నుంచి నాలుగులీటర్ల నీటిని తాగాలి. నీటిని కాస్త గోరువెచ్చగా చేసుకుని తాటితే మరీ మంచిది. మొదట్లో ఒకేసారి నాలుగుగ్లాసుల నీటిని తీసుకోవడం కష్టమవుతుంది. అలా కాకుండా ఒకసారి రెండుగ్లాసులు, ఐదునిమిషాల గ్యాప్ తరువాత మరో రెండు గ్లాసుల నీటిని తాగాలి. ఇలా చేస్తే 30 నిమిషాల్లో మీ సమస్య తీరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి