కొందరు మహిళలు ఉన్నట్టుండి బరువు పెరిగిపోతుంటారు. ఆ బరువుకు అంతూ పంతూ కూడా ఉండదు. దీనికి గల కారణాలు ఏమిటి? అనేది ఆలోచిస్తే.. చాలా కారణాలే ఉన్నాయి. అయితే అలా బరువు పెరగడానికి ముఖ్య కారణం నిద్రించే ముందు టీవీ లేదా మొబైల్ ఫోన్, లాప్ టాప్‌ను వాడుతుండడమేనని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఎందుకంటే చీకటిలో నిద్రించేందుకు ముందు టీవీ చూసే వారికంటే... చీకటిలో పడుకుని టీవీ, స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్ వంటివి చూసే వారిలో ఎలాంటి కృత్రిమ లైట్ అయిన ఊబకాయాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నెదర్లాండ్‌లోని లైడెన్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా, కృత్రిమ లైట్ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని వారంటున్నారు.
కృత్రిమ లైట్ ప్రభావంతో విపరీతంగా బరువు పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా, ఇది క్యాలోరీలను ఖర్చు చేసే బ్రౌన్ సెల్స్‌మీద ప్రభావం చూపుతుందని తెలిపారు. ఊబకాయానికి ముఖ్యంగా గురయ్యే ప్రమాద స్థాయిలు నిద్ర లోపాలు, కృత్రిమ లైట్‌కు బహిర్గతమయ్యే స్థాయిలపై ఆధారపడి ఉంటుందని శాండర్ కూ ఇజ్మాన్ అనే పరిశోధకుడు తెలిపారు. ఊబకాయంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి ఇతర వ్యాధులు కలుగుతాయి.