ఇవి తింటే బాగా నిద్రపోతారు... తిని చూడండి

గురువారం, 23 జులై 2020 (23:40 IST)
చాలామంది నిద్రపట్టక గింజుకుంటూ వుంటారు. అలాంటివారు ఈ పదార్థాలను తీసుకుంటే నిద్ర తన్నుకుంటూ వచ్చేస్తుంది. అరటిపండు మెగ్నీషియం, పొటాషియం, ఖనిజాలు వుంటాయి. దీన్ని బెడ్ టైమ్‌ సమయంలో తింటే మంచి నిద్ర వస్తుంది. అలాగే చెర్రీలు మెలటోనిన్‌‌కి సహజ ఆధారము. పడుకునే ముందు వీటిని తింటే త్వరితముగా నిద్రపడుతుంది.
 
అవిసె గింజలు శరీరములో నిద్రను క్రమబద్ధీకరించే 'సెరటోనిన్‌' స్థాయిలను మెరుగుపరచడంలో బాగా సహకరిస్తుంది. పిండి పదార్థాలతో కూడిన ఆహారం.. ట్రీప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లాన్ని మెదడుకు చేరుకునేలా చేసి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. ప్రోటీన్లతో నిండిన పదార్థాల్లోనూ ట్రీప్టోఫాన్‌ ఉంటుంది. అందువల్ల ప్రోటీన్లతో పాటు పిండి పదార్థాలనూ తీసుకోవటం నిద్రకు ఉపకరిస్తుంది. కడుపునిండా పుష్కలంగా ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా గల ఆహారం తిన్నప్పుడూ నిద్రమత్తుతో జోగేలా చేస్తుంది.
 
పాలు, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులలో "ట్రిప్టోఫాన్‌" ఉంటుంది , ఈ ఎమినోయాసిడ్ స్లీప్ సెరటోనిన్‌ ఉత్పత్తికి, నిద్రకు సహకరించే మెలటోనిన్‌‌కు, శారీరక అంతర్గత క్లాక్ క్రమబద్దీకరణకు సహకరిస్తుంది. ఆహారంలో కాల్షియం లోపం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఓట్స్ ట్రిప్టోఫాన్‌‌కు చక్కని సహజ ఆధారం. పడుకునే ముందు వీటిని స్నాక్‌గా తీసుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు