ఎండిన మునగకాయలోని విత్తనాలను పొడిచెయ్యాలి. ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీనివల్ల బి.పి కంట్రోల్ అయి ఆదుర్దా తగ్గుతుంది. మునగ రసం క్యారెట్ రసంతో కలిపి తాగాలి. పచ్చిదోస రసం, మునగ రసం చెరొక గరిటెడు కలిపి తాగినా మూత్రం సాఫీగా అవుతుంది.
మునగాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలపై రాయాలి. మునగ గింజలని చూర్ణం చేసి కషాయంగా వాడినా తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. మునగాకు నీడలో ఆరబెట్టి, పొడిచెయ్యాలి. ఆ పొడిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు రాసుకొని కొంత సేపు ఆగి తలస్నానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.