ఈ నేపథ్యంలో చక్కెర వ్యాధిని అరికట్టాలంటే రోజుకో గుడ్డు తింటే సరిపోతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే నిత్యం శరీరానికి సంపూర్ణ పోషణ అందాలంటే రోజుకో గుడ్డును తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే రోజుకో గుడ్డును తినడం వల్ల పోషణ అందడం మాత్రమే కాదు, డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని తమ పరిశోధనలో తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
అంతేకాకుండా, రోజుకో గుడ్డును ఆరగించినట్టయితే డయాబెటీస్ వ్యాధికి దూరంగా ఉండొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సైంటిస్టులు 239 మంది వ్యక్తులను 20 ఏళ్ల పాటు పరిశీలించారు. రోజుకో గుడ్డు తినేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు, గుడ్డు తినని వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు తేల్చేశారు.