సుగంధ తైలాలతో మాలిష్ చేస్తే సుఖవంతమైన నిద్ర!

బుధవారం, 3 ఆగస్టు 2016 (10:23 IST)
ప్రసుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర కరువవుతుంది. దీంతో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. శారీరక లేదా మానసికపరమైన ఒత్తిడే దీనికంతటికి కారణమని నిపుణులు అంటున్నారు. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే శరీరానికి సుగంధ భరితమైన తైలాలనుపయోగించి మీ శరీరానికి మాలిష్ చేస్తే సుఖవంతమైన నిద్ర సొంతమంటున్నారు నిపుణులు. 
 
ఎలాగంటే... 30 మిల్లీగ్రాముల బేస్ నూనెలో ఐదు చుక్కల కైమోమైల్ నూనె, ఐదు చుక్కల మెజోరమ్ నూనె, 15 చుక్కల చందనపు నూనె, ఐదు చుక్కల క్లైరీసెజ్ నూనెను కలుపుకుని మాలిష్ చేయాలి. దీంతో శరీరానికి, మనసుకు కొత్త శక్తి వచ్చి ఉపశమనం కలుగుతుంది. మాలిష్ చేసుకునేటప్పుడు శరీరపు వెనుక వీపు భాగం, మెడ, భుజాలను పూర్తిగా మాలిష్ చేయాలి. మాలిష్ చేసిన అనంతరం వేడి నీటిలో స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరం కొత్త ఉత్తేజం పుంజుకుంటుంది. 

వెబ్దునియా పై చదవండి