గంటల తరబడి అదేపనిగా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారికి కళ్లు అలసటగా ఉంటాయి. అలానే బయటకు వెళ్ళినప్పుడు వాతావరణం కారణంగా కంట్లో దుమ్ము, ధూళి వెళ్లి కళ్లను ఒత్తిడికి గురిచేస్తాయి. ఈ సమస్యలతో కళ్లు కాంతిని కోల్పోతాయి. కంటికి తగినంత విశ్రాంతి లేకపోతే కూడా కళ్లు అలసటగా ఉంటాయి. దాంతో కంటి కిందట నల్లటి వలయాలు ఏర్పడుతాయి.
3. కళ్లు విపరీతంగా మండుతుంటే.. ఐస్‌క్యూబ్స్‌తో కళ్లపై మర్దన చేసుకోవాలి. ఓ 5 నిమిషాల పాటు అలానే చేయాలి. ఇలా చేస్తే కళ్ల ఒత్తిడి తగ్గుతుంది. ధనియాలు కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్లాస్ నీటిలో 2 స్పూన్ల ధనియాలు వేసి రాత్రంత నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా బెల్లం కలిగి తాగితే మంచిది.