ఈ 15 ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు...

మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (20:42 IST)
1. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు-మూడు గ్లాసుల గోరువెచ్చటి మంచి నీటిని సేవించండి.
 
2. ప్రతి రోజు కనీసం పదిహేను నిమిషాలపాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి. 
 
3. ఉసిరి లేదా త్రిఫలాతో కూడుకున్న నీటిని సేవించండి.
 
4. వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి.
 
5. టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను సేవించకండి.
 
6. సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి.
 
7. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి-మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి.
 
8. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి.
 
9. భోజనంలో సలాడ్, రుతువులననుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోండి.
 
10. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు వుండేలా చూసుకోండి.
 
11. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి.
 
12. ఉదయం-రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్లు తోముకోవాలి.
 
13. సమయానుసారం భోజనం చేయాలి, రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి.
 
14. రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటిన రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమౌతాయి. 
 
15. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లౌతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన సంగీతం లేదా పుస్తకపఠనం చేస్తే చాలా మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు