పాదాల మంటలు వేధిస్తుంటే.. ఇలా చేయండి.

మంగళవారం, 9 మే 2017 (12:02 IST)
కాలి పాదాల్లో ఇన్ఫెక్షన్లు, మంటలు వేధిస్తుంటే.. ఈ టిప్స్ పాటించండి. రెండు చెంచాల పసుపులో కాసిని నీళ్లు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని పాదాలకు పూతలా వేసుకోవాలి. అది ఆరాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల్లోని రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. నొప్పి మంట తగ్గుతాయి. పాదాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. 
 
యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ అందుబాటులో ఉంటే ఈ సమస్య నుంచి పరిష్కారం పొందొచ్చు. చిన్న టబ్బులో నీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, కొద్దిగా ఎప్సంసాల్ట్‌ వేసి పాదాలను అందులో ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత కాళ్లను శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  
 
అర బకెట్‌ నీళ్లలో కొన్ని ఐస్ ముక్కలు వేసి అందులో కాళ్లని ఉంచాలి. ఇలా చేయడం వల్ల మంట, వాపు తగ్గుతాయి. కాసేపయ్యాక మర్దన చేసుకుని మళ్లీ కాళ్లను నీళ్లలో ఉంచాలి. రోజులో ఒకటిరెండుసార్లు ఇలాచేస్తే ఉపశమనం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి