వెల్లుల్లిని తీసుకుంటే 150 వ్యాధులు మటాష్.. వెల్లుల్లిని పాలలో ఉడికించి? (Video)

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (12:49 IST)
వెల్లుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది. ఛాతిలో మంటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈస్ట్, ఫంగస్ వచ్చే ఇతరత్రా ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. వాటిని నియంత్రించేందుకు పోరాడుతుంది. వెల్లుల్లిలోని మాంగనీసు, క్యాల్షియం, భాస్వరం, సెలినియం, విటమిన్ బి6, సిలతో అనారోగ్యాలు దరిచేరవు. 
 
ఇందులోని శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు 150కి పైబడిన వ్యాధులతో పోరాడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లి చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
 
అలాగే పాలలో వెల్లుల్లి రెబ్బల్ని ఉడకబెట్టి తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. మైగ్రేన్ తలనొప్పి తగ్గించడానికి ఈ వెల్లుల్లి పాలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా నిద్ర చక్కగా పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు