ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే?

శనివారం, 7 జనవరి 2023 (13:45 IST)
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అల్లం రసం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి మలినాలను బయటకు పంపుతుంది. ఆర్థరైటిస్ బాధితులు అనుభవించే తీవ్రమైన కీళ్ల నొప్పుల నుండి అల్లం ఉపశమనాన్ని అందిస్తుంది.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అల్లం రసం తాగడం చాలా మంచిది. అల్లం రసం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి గుండె జబ్బులను నివారిస్తుంది. ఖాళీ కడుపుతో అల్లం రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 
అల్లం రసం ఋతుస్రావం సమయంలో అనుభవించే కడుపు నొప్పి, కండరాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లం వికారం, అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గమనిక: అల్లం రసం అందరికీ ఒకేలా పనిచేయదు కనుక ఈ చిట్కాలు పాటించే ముందు వైద్యుడి సలహా అవసరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు