అధిక బరువును తగ్గించే ఆహార పదార్థాలు ఏమిటి?

బుధవారం, 4 జనవరి 2023 (22:09 IST)
మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు బరువు తగ్గడంలో సహాయపడతాయని నిపుణులు చెపుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము.
 
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల బరువు తగ్గవచ్చు.
 
ఆరెంజ్ తక్కువ కేలరీల పండు. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 
కొవ్వు రహిత పెరుగును రోజూ తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
టొమాటో శరీరంలోని అవాంఛిత కొవ్వు పదార్థాలను వదిలించుకోవడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 
మామిడి శరీర జీవక్రియ, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
 
పైనాపిల్‌లోని బ్రోమెలిక్ యాసిడ్ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
 
ఉసిరి జీవక్రియను సమతుల్యం చేయడానికి, మెరుగుపరచడానికి, ఊబకాయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
 
గమనిక: చిట్కాలను పాటించేముందు వైద్యుని సలహా తీసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు