దోర-దోర జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. ఉదయం-రాత్రిపూట భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుంది.
భోజనానికి ముందు జామపండు తినాలనుకుంటే, భోజనం చేయడానికి కనీసం రెండు గంటల ముందు తినాలి.అతితక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి, ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు. ఎక్కవ పీచుపదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.