ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర. గోంగూర అంటే ఇష్టపడే వారు ఎందరో.... గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు వండొచ్చు. దీనిని ఆంధ్రదేశమున విరివిగా వాడతారు. అందుకే గోంగూరను ఆంధ్రమాత అని అంటారు. ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ,సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్ మరియు పీచు ఎక్కువుగా ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువుగా ఉండటం వలన కొంచెం ఎక్కువ తింటే అరగదు. దీని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.
2. రేచీకటి, రాత్రిపూట సరిగా చూపుకనపడక పోవడం అనే నేత్ర రోగం లేదా దృష్టి దోషంతో బాధపడేవారు భోజనంలో ఆకుకూర గానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. అయితే తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అరకప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది.