కాఫీ-టీలకు బదులు గ్రీన్ టీ తాగండి.. ఫలితం ఏంటో తెలుసుకోండి?

సోమవారం, 2 జనవరి 2017 (11:33 IST)
చాలా మంది పొద్దస్తమానం కాఫీటీలు తాగుతుంటారు. ఉదయం లేవగానే చాలా మందికి టీ లేనిదే రోజు గడిచినట్టు అనిపియ్యదు. ఆఫీసుకు.. ఇతర పనుల్లో ఉన్నా కాఫీలు.. టీలు అలా కానిస్తుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. అలసట చెందినా టీ తాగాలని అనిపిస్తుంటుంది. మరికొందరు చిప్స్ ఇతరత్రా నమిలేస్తూ ఉంటుంటారు. ఈ రెండు అలవాట్లు ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
పదేపదే టీలు తాగడం వల్ల శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగిపోతాయని, ఊబకాయంతో పాటు కేన్సర్ బారినపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. టీలు.. కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగాలని, అది యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుందని సలహా ఇచ్చారు. 
 
అదేవిధంగా వారాల తరబడి ఫ్రిజ్‌లో ఉన్నవికాకుండా తాజా కూరగాయాలు, కూరలు తినాలని సూచిస్తున్నారు. ఇలాచేయడం వల్ల అనారోగ్యాలను దూరంగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి