ఇటీవల నెలవారీ ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మెదడు రక్తనాళాల్లో ఏర్పడిన క్లాట్‌కు చిన్నపాటి ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ పూర్తయినప్పటి నుంచి ప్రణబ్ పరిస్థితి విషమంగా మారిందని, ప్రస్తుతం ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి మంగళవారం పేర్కొంది.
ఇప్పటికీ ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి మెరుగుదల కనిపించడంలేదని, వైద్య నిపుణుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా నిర్ధారణ అయింది. ప్రణబ్ త్వరగా కోలుకోవాలంటూ కేంద్ర మంత్రులు, నేతలు సోమవారం నుంచే తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.