పాలకూర జ్యూస్‌తో డయాబెటిస్ చెక్...

సోమవారం, 17 సెప్టెంబరు 2018 (10:13 IST)
డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినరాదు. అలానే పిండి పదార్థాలు అధికంగా ఉండే పదార్థాలను కూడా తినరాదు. పాలకూరను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది. పాలకూరలో ఫైబర్, మినరల్స్, న్యూట్రియన్స్, విటమిన్స్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి.
  
 
ఈ పాలకూరను జ్యూస్ రూపంలో తీసుకుంటే అధిక బరువు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూరలోని ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించేందుకు చక్కగా పనిచేస్తుంది. ఒక కప్పు పాలకూరలో కేవలం 7 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఇది చక్కని ఔషధంగా సహాయపడుతుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు