ప్రతిరోజు గుమ్మడికాయ విత్తనాలు తీసుకుంటే?

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:30 IST)
గుమ్మడికాయ విత్తనాల్లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విత్తనాల్లో జింక్, మెగ్నిషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, క్యాల్షియం, పాస్పరస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, బి వంటి ఖనిజాలు చాలా ఉన్నాయి. గుమ్మడికాయ విత్తనాలు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
గుమ్మడికాయ విత్తనాలను పురుషులు తరచుగా తీసుకుంటే వారిలో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. తద్వారా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కండరాలకు మరమ్మత్తులు చేయుటకు, కొత్త కణాలను నిర్మించుటకు గుమ్మడికాయ విత్తనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
గుమ్మడికాయ విత్తనాలను తరచుగా తీసుకోవడం వలన శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తిని పెంచుటకు గుమ్మడికాయ విత్తనాలు దివ్యౌషధంగా ఉపయోగపడుతాయి. నిత్యం వ్యాయామం చేసిన తరువాత గుమ్మడికాయ విత్తనాలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని అధ్యయనంలో తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు