మామిడి పండ్లలో పోషకాలు మెండుగా వుంటాయి. మామిడి సీజన్ ప్రారంభమైంది. ఇప్పుడు పచ్చి మామిడి కాయలు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మామిడి కాయలు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
పచ్చి మామిడి పండ్లలో ఉండే కెరోటినాయిడ్‌లు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పచ్చి మామిడిపండ్లు చిగుళ్లలో రక్తస్రావం, స్కర్వీ వంటి వ్యాధులను నియంత్రించడంలో సహాయపడతాయి.
పచ్చి మామిడికాయను మితంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ రుగ్మతలు నయమవుతాయి.
పచ్చి మామిడి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మితంగా ఉండే పచ్చి మామిడి శరీరాన్ని హైడ్రేట్‌గా, చల్లగా ఉంచుతుంది.
చర్మవ్యాధి ఉన్నవారు పచ్చి మామిడి పండ్లను తినేటప్పుడు చర్మంపై చికాకు, దురదను ఎదుర్కొంటారు.
పచ్చి మామిడి పండ్లను తినడం వల్ల కొంతమందికి గొంతు నొప్పి వస్తుంది.