మెులకలతో రక్తహీనతకు చెక్ పెట్టేయవచ్చు... ఇంకా చాలా వున్నాయండోయ్...

మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (10:42 IST)
మెులకలు తరచుగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. ఈ మెులకలలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. జీర్ణశక్తికి పెంచుటకు మెులకలు చక్కగా పనిచేస్తాయి. వీటి వలన ఎంజైముల పనితీరు మెరుగుపడుతుంది. రక్తహీనతను తగ్గించుటకు మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అధిక బరువును తగ్గించుటకు సహాయపడుతాయి.
 
చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచుటకు మంచిగా దోహదపడుతాయి. వీటిల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం అధికంగా ఉంది. మెులకల్లో విటమిన్ కె, సి, ఎ, ఐరన్, క్యాల్షియం, మినరల్స్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మెులకలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు