కలబంద ఆరోగ్యానికి, అందానికి చాలా ఉపయోగపడుతుంది. గాయాలు, పుండ్లకు కలబంద దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా ముదిరిన కలబంద మట్టలపై తొక్కను తొలగించి ఆ లోపలి గుజ్జు భాగాన్ని శుభ్రంగా ఏడు సార్లు నీరు మార్చుతూ కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోసుకుని అందులో పటిక బెల్లం చేర్చికుని తీసుకుంటే శరీర వేడిని తగ్గించుటకు ఉపయోగపడుతుంది.
పటిక బెల్లాన్ని కొద్దిగా నీటిలో మరిగించుకుని కడిగిన కలబంద ముక్కలపై ఒత్తుగా జల్లి పలుచని వస్త్రంలో కట్టి కళ్ల వ్యాధులతో బాధపడుతున్నవారు కళ్లపై అద్దుకుంటే కళ్ల కలుకలు, నీరు కారడం, ఊసులు కట్టడం, నొప్పి, ఎర్రబారడం వంటి సమస్యలు తొలగిపోతాయి. కలబంద రసంతో కొద్దిగా పసుపు పొడిని కలుపుకుని తీసుకుంటే చర్మ వ్యాధిగ్రస్తులకు నివారణగా సహాయపడుతుంది.