బార్లీ నీటిలో నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే?

సోమవారం, 3 సెప్టెంబరు 2018 (15:42 IST)
ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ చిట్కాలు పాటిస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు నలుపుకుని గంటకోసారి వాసన పీల్చుకుంటే 6 గంటలలో జలుబు త్వరగా తగ్గుతుంది. బార్లీ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే గుండెలో మంట తగ్గుతుంది.
 
అల్లం రసంలో తులసి, తేనెను కలుపుకుని ప్రతిరోజూ మూడు పూటల తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుంది. శొంఠి పొడిలో మిరియాలు, తులసి ఆకుల పొడిని వేసుకుని కషాయంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెరను కలుపుకుని వేడివేడిగా తాగితే ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. 
 
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని నీటితో బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులో తేనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం పిండుకుని అందులో తేనెను కలుపుకుని తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా జలుబు తగ్గేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు