మందులు వేసుకున్న తర్వాత పండ్ల రసాలు తాగొద్దు..

గురువారం, 29 డిశెంబరు 2016 (10:35 IST)
మందులు వేసుకున్న వెంటనే పండ్లరసాలు తాగితే ఆ మందులు అనుకున్న ఫలితాలు ఇవ్వవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు కనీసం అరవైగ్రాముల పెరుగు తినేవారిలో చిగుళ్ల వ్యాధులు రావు. పెరుగులో ఉండే లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్లపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. తద్వారా చిగుళ్లు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి.
 
అధిక కొవ్వుతో బాధపడేవారు అవిసెనూనెను ఆహారంలో భాగం చేసుకుంటే... శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రతగలిగిన కొవ్వు(ఎల్‌డీఎల్‌) త్వరగా కరిగిపోతుంది. తలకు రాసుకునే నూనె పరిమాణంలో తేనె తీసుకుని కుదుళ్లకు అంటేలా మర్దన చేయండి. అరగంట తర్వాత పొడిజుట్టుకు ప్రత్యేకించిన షాంపూతో స్నానం చెయ్యండి. వారానికొకసారి ఇలా చేస్తే... బిరుసుగా ఉండే జుట్టు మళ్లీ జీవంతో నిగనిగలాడుతుంది. రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు కలిపి నూరి ముద్దలాగా చేయండి. కుంకుడు గింజ పరిమాణంలో రోజూ ఈ మిశ్రమాన్ని తింటే అజీర్ణం దరిచేరదు. 

వెబ్దునియా పై చదవండి