తేనెను వేడి చేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి...(video)

శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (22:52 IST)
సాధారణంగా మహిళలు రుతుసమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుండి బయటపడాలంటే బియ్యం కడిగిన నీటిలో మూడు స్పూన్ల దాల్చిన చెక్క పొడి వేసి త్రాగితే ఫలితం ఉంటుంది.
 
కొన్ని సందర్భాలలో కొంత మందికి గుండె పట్టేసినట్లు ఉంటుంది. అలాంటప్పుడు దాల్చిన చెక్కను మెత్తగా పొడి చేసి అందులో యాలకుల పొడిని కూడా కలిపి నీటిలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో త్రాగితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
 
తలనొప్పి తగ్గాలంటే దాల్చిన చెక్క చూర్ణాన్ని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి నుదుటిపై రాసుకుంటే సరిపోతుంది.
 
చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలుపుకుని రోజూ మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.
 
తేనెను వేడి చేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి చర్మానికి రాసుకున్నా లేదా సేవించినా దురదలు, చెమట పొక్కులు, ఎగ్జిమా నుండి ఉపశమనం పొందవచ్చు.
 
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి, కొద్దిగా చక్కెర వేసి తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు