చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. ఇది ఎక్కువగా అమ్మాయిలు, మహిళల్లో కనిపిస్తుంది. అలాగే, పురుషుల్లో కూడా తలస్నానం చేసే సమయంలో వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయి. దీనికి కారణాలు లేకపోలేదని వైద్యులు అంటున్నారు.
* జుట్టు రాలిపోవడానికి కారణాలేంటంటే...
* సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నిద్రలేకపోవడం.
* తగినన్ని నీళ్లు తాగక పోయిన జుట్టు ఎక్కువగా రాలిపోతు ఉంటుంది.
* ఒత్తిడి మాత్రం అన్నింటికి మించి ఎక్కువ ప్రభావం చూపుతుంది.
నివారణ చిట్కాలు...
* వారానికి కనీసం 2 సార్లు అయినా కలబంద గుజ్జు రాస్తుండాలి.
* తలస్నానం చేసే ముందు కొబ్బరినూనెను కాస్త వేడి చేసి మాడుకు మర్దనా చేయాలి.
* ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో గుడ్డు, పాలు, ఆకుకూరలు ఉండే విధంగా చూసుకోవాలి.
* ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయమం చేస్తూ, మంచి సంగీతం వింటూ ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.