బ్రేవ్.. బ్రేవ్.... గ్యాస్ ట్రబుల్ అడ్డుకోవడమెలా? ఏం తింటే ఆగుతుంది?

శనివారం, 3 జూన్ 2017 (19:49 IST)
కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, బ్రేవ్ బ్రేవ్ మంటూ త్రేన్పులు. కూర్చున్నచోట కూర్చోలేని పరిస్థితి. చికాకు, కోపం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలే. ఈ సమస్యను అధిగమించాలంటే ఇవి పాటించాలి.
 
1. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి.
2. ప్రతిరోజూ విధిగా వ్యాయామం చేయాలి.
3. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
4. టీ, కాఫీలు మానేయాలి.
5. మసాలాలు, వేపుళ్లు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ మానివేయాలి.
6. వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్లు సరిపడినంత తాగాలి.
7. నిల్వ వుంచిన పచ్చళ్లు తినడం మానేయాలి.
 
సమస్యను అడ్డుకునేందుకు ఏం చేయాలి?
* శొంఠి చూర్ణంతో పాత బెల్లం సమంగా కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తిని ఆ తర్వాత వేడి నీళ్లు తాగితే కడుపులో వున్న గ్యాస్ సమస్య పోతుంది. 
 
* ధనియాలు, శొంఠి సమభాగాలు చూర్ణం చేసి కలిపి ఒక టీ స్పూన్ ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో తీసుకుంటే కడుపులో చెడుగాలి పోయి సాఫీగా విరేచనం అవుతుంది.
 
* అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

వెబ్దునియా పై చదవండి