వేసవిలో వేడిగాలులు, దప్పిక నుంచి శరీరాన్ని రక్షించే గుణం గల ఖర్బూజా పండు అధిక బరువును తగ్గించటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు రాత్రిపూట భోజనం మానివేసి ఓ వంద లేదా రొండొందల గ్రాముల వరకు ఖర్బూజా ముక్కలను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఖర్బూజాలో లభించే కెలోరీలు శరీరానికి శక్తిని అందిస్తే, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచటం, మూత్రపిండాల్లో రాళ్లు తయారు కాకుండా ఆపటం లాంటివి చేస్తుంది. పీచు అధికంగా లభించే ఈ పండును కొద్దిగా తిన్నా, కడుపునిండా తిన్న భావన కలుగుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించటంలో ఖర్బూజా ప్రభావవంతంగా పనిచేస్తుంది.