వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:02 IST)
వర్షాకాలంలో అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే... ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం.
 
* వర్షాకాలంలో వీలైనంత మేరకు పచ్చి కూరగాయల బదులు మరిగించిన సలాడ్‌లు తీసుకోండి.
* ఆపిల్‌, దానిమ్మ, అరటిపండ్లను ఎక్కువగా తినాలి. ఇవి ఆరగించడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు. 
* అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారు చేసిన హెర్బల్‌ టీలు తీసుకోండి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి.
 
* తాజా ముల్లంగి రసాన్ని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మొక్కజొన్న, శనగపిండి, శనగలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. 
* బ్రౌన్‌రైస్‌, ఓట్స్‌, బార్లీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
 
* వెల్లుల్లిని సూప్‌లలో, కూరలలో విధిగా వేయండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. 
* కాకరకాయ, పసుపు పొడి, మెంతులను ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి ఇన్‌ఫెక్షన్ల బారినుంచి మిమ్మల్ని కాపాడుతాయి. 
* పల్లి, ఆముదం, నువ్వుల నూనె బదులు తేలికగా ఉండే మొక్కజొన్న నూనెను వంటలలో ఉపయోగించండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు