శరీరంలో వేడి అనేది చాలామందికి ఉండే ఆరోగ్య సమస్య. శరీరంలో వేడి చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేడి వల్ల అంతర్గత అవయవాలకు నష్టం. వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, కురుపులు, మూత్రం మంటతో రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం, మైకం, వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడిని కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా తాగడం ఇదంతా వేడి చేయడానికి కారణాలు.
ఎప్పటికప్పుడు చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజులో రెండు లేదా మూడుసార్లు కొబ్బరి నీళ్ళు తాగాలి. పల్చటి మజ్జిగలో ఉప్పు, నిమ్మకాయ కలుపుకొని తాగితే మంచిది. పాలలో తేనెను కలిపి తాగాలి. వంటకాలలో కొబ్బరినూనె, ఆలివ్ నూనెలను వాడాలి. రోజూ ఉదయాన్నే దానిమ్మ రసం తాగాలి. గసగసాలు శరీరాన్ని చల్లబరచడానికి బాగా పనిచేస్తాయి.