అవును.. నీటికి కొవ్వును కరిగించే శక్తి వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు శరీరంలో క్లెన్సర్‌గా పనిచేస్తుంది. సాధారణ నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అందుకే రోజుకు కనీసం రెండుసార్లైనా రెండు గ్లాసుల వేడినీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి హానిచేసే కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే.. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీటిని తాగడం ద్వారా బరువు కూడా తగ్గుతుందని వారు చెప్తున్నారు.
ఇందులో భాగంగా ప్రతిరోజూ లేవగానే కనీసం నాలుగు గ్లాసుల నీళ్లు తాగాలి. అయితే ఒకేసారి నాలుగు గ్లాసులు ఒకేసారి కష్టం అనుకునేవారు.. తొలుత గ్లాసుతో ప్రారంభించి నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. రోజూ మొత్తంలో పది నుంచి 12 గ్లాసుల నీటిని తాగడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. హైబీపీ దరిచేరదు. కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
అలాగే తీసుకునే ఆహారంలో కొవ్వు అధికశాతం లేకుండా చూసుకుంటే బరువు తగ్గుతారు. మైదా, పంచదార, ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న చిరుతిళ్లను మానేయాలి. నూనెలో వేయించిన పదార్థాలను తగ్గించాలి. గోధుమలతో చేసిన బ్రెడ్‌ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసుకోవచ్చు. ఆహార పదార్థాల్లో ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.